28-02-2025 07:47:13 PM
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే గ్రూప్ ఎజెంట్ గా విధులు నిర్వహించి పదోన్నతిపై కొత్తగూడెం కార్పొరేట్ కు బదిలీపై వెళ్తున్న రామదాసును ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి దేవేందర్ ఘనంగా సన్మానించారు. జిఎం కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్క అధికారికి ఉన్నత పదవులు రావడం ఉన్న స్థలము నుండి వేరొక స్థలంలోకి వెళ్లడం అనివార్యం అన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న అధికారి విడి నిర్వహణలో ఏరియాకు చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, జనరల్ మేనేజర్ కార్యాలయం, అన్ని గనులు, డిపార్ట్మెంట్ల హెచ్ఓడిలు, అధికారులు పాల్గొన్నారు.