మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్పమానవతా వాది, గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి దేశ చరిత్రలో మరువలేని మహానేతగా నిలిచిపోయారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం ప్రవేశ పెట్టిన సంతాపం తీర్మానాన్ని బలపరుస్తూ.. మన్మోహన్ సింగ్ లేని లోటు తీర్చలేనిదని, దేశం ఒక మహనీయుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆయన పదేండ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని, నేటికీ ఆయన మార్గాలు పలు దేశాలు అనుసరిస్తున్నాయని, నేటి రాజకీయ నాయకులు ఆయన చూపి బాటలో నడవాలని కోరారు. సమ్రగ భూసేకరణ చట్టం, ఆర్టీఏ చట్టం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాలు తెచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.