calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక క్షేత్రం బెల్లంపల్లికి మహర్దశ!

28-03-2025 12:00:00 AM

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరుపై హర్షం

రూ.200 కోట్లతో ఆశ్రమ పాఠశాల 

25 ఎకరాల్లో అత్యున్నతమైన విద్యాలయం

బెల్లంపల్లి అర్బన్, మార్చి 27: ఎట్టకేలకు బెల్లంపల్లి కార్మిక క్షేత్రానికి మహర్దశ ఆవరించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు ప్రకటించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాల మంజూరులో బెల్లంపల్లికి చోటు కల్పి ంచారు. దీంతో ఈ ప్రాంత వాసుల్లో సంతో షం వెల్లివెరుస్తోంది. పారిశ్రామిక ప్రాంతం గా పేరుగాంచి భూగర్భ గనుల వెనుకడుగుతో బెల్లంపల్లి ఉనికినీ కోల్పోతుంది.

ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరుతో బెల్లంపల్లికి పూర్వ వైభవం రానుంది. నూతనంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరులో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజక వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రూ. 200 కోట్లతో ఒక్కో పాఠశాల 25 ఎకరాల విస్తీర్ణంలో అత్యున్నతమైన ప్రమాణాలతో భవనాలు ఏర్పాటు చేయనున్నారు.

నూతనంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాల విద్యా బోధన లభిస్తుంది. భవిష్యత్తులో కేజీ నుంచి పీజీ వరకు ఈ ప్రాంతం పిల్లలకు అత్యున్నతమైన విద్య అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. 

ఎమ్మెల్యే వినోద్ ప్రత్యేక చొరవ...

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరులో ప్రత్యేక చొర వను కనపరిచినట్లు తెలుస్తుంది. సీఎం రేవం త్‌రెడ్డిని ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు విషయంలో తగిన శ్రద్ధ వహించి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.  బెల్లంపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఉన్నత విద్యా అవ కాశాలకు ఏకైక మార్గంగా ఉంది. ఎంతోకాలంగా ఈ ప్రాంత ప్రజలు తమ పిల్లల ఉన్న త విద్య కోసం సుదూర ప్రాంతాలకు పంపిస్తున్నారు.

లక్షల రూపాయలను కార్పొరేటు కళాశాలలకు ఫీజులు రూపంలో చెల్లిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలతో ఈ ప్రాంత విద్యార్థులు అందిపుచ్చుకోనున్నారు. ఇప్పటి వర కు బెల్లంపల్లి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఏ ఎమ్మెల్యే, ప్రభుత్వాన్ని ఒప్పిం చి ఉన్నత విద్య కళాశాలను సాధించిన ఘనత లేదు.

బెల్లంపల్లిలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సాధించి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రికా ర్డును సొంతం చేసుకున్నారు. ఇదే కాకుండా బెల్లంపల్లిలో ఇంజనీరింగ్ కళాశాల కూడా తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఇంజనీరింగ్ కళాశాల ఒకటి అనే విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే అత్యున్నతమైన విద్య ప్రమాణాలు గల స్కూల్‌ను సాధించడంతో ఈ ప్రాంత ప్రజలు ఆనంద డోలికల్లో మునిగిపోతున్నారు. 

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరుతో బెల్లంపల్లి జాతీయస్థాయిలో విద్య ప్రమాణాల సరసాన నిలువనుంది. ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజల ఊహకందని అత్యున్నతమైన విద్య ప్రమాణాలు గల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కల నెరవేరినట్టయింది. ఈ మేరకు అధికారగ ణం స్కూల్ నిర్మాణం కోసం 25 ఎకరాల స్థల సేకరణలో ఉన్నారు. స్థలం గుర్తింపు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారని సమాచారం. ఆమోదయోగ్యమైతే త్వరలోనే ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ స్కూల్  ఏర్పాటులో తొలి ఘట్టం సుఖాంతమైనట్టే.