calender_icon.png 3 April, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

26-03-2025 12:46:26 AM

భోలక్‌పూర్‌లో పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 25: (విజయక్రాంతి): భోలక్‌పూర్ డివిజన్లోని పద్మశాలి కాలనీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వేద పండితుల సమక్షంలో వేంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఆలయ కమిటీ నేతలు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యానాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్య లో తరలిరావడంతో పరిసర ప్రాంతాలు  భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సీనియర్ నాయకులు బింగి నవీన్ కుమార్, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సీతా మార్కండేయ, పుండరీకం, కోశాధికారి గడ్డం నవీన్ కుమార్, సలహాదారులు ఆర్. ఆంజనేయులు, కృష్ణమూర్తి, కార్యనిర్వహక కార్యదర్శి ఎ. వెంకటేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..