calender_icon.png 12 March, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

12-03-2025 12:11:13 AM

పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, చల్లా వంశీచంద్ రెడ్డి 

కడ్తాల్, మార్చి 11 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ మండలం రావిచెడ్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి వారి కల్యాణ మహోత్సవం వేదపండితుల మంత్రోచ్చారణల మద్య అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, మాజీ సర్పంచి విఠలయ్య గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.