13-02-2025 02:01:22 AM
ఆలయ 30 వ వార్షికోత్సవ వేడుకలు
జగిత్యాల, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని శ్రీబ్రహ్మంగారి ఆలయంలో శ్రీగోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రాచీన విధానంలో పూర్తి రాతి కట్టడంతో బ్రహ్మంగారి ఆలయాన్ని కోరుట్ల లో నిర్మించి మూడు దశాబ్దాలు ముగిసింది.
ఈ సందర్భంగా దేవాలయ 30వ వార్షికో త్సవం, స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 4 వేల మంది భక్తులు పాల్గోని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో అధ్యక్షులు ఇందూ రి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బెజ్జరాపు చందు, కోశాధికారి శ్రీరాముల ప్రశాంత్, నిర్వాహకులు ఇందూరి సత్యం, బెజ్జరాపు రాజు, సదానందచారి, బెజ్జరాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.