కొండపాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఉషోదయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాదేవి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. గ్రామంలోని శంభు దేవాలయం వద్ద ఉషోదయ ఆధ్వర్యంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం అమ్మవారి విగ్రహ నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర జరిగింది. మహిళల కోలాటలు, పిల్లల నృత్యాలు, ప్రత్యేక వేషధారణలతో కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ప్రధానంగా నవదుర్గల అలంకరణ విశేషంగా అలరించింది. అమ్మవారి ఆశీస్సులతో, దాతల సహకారంతో, గ్రామ ప్రజల అండదండలతో శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్టు ఉషోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలుముల రవి తెలిపారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మెరుగు శ్రీనివాస్ వ్యవహరించారని చెప్పారు. శోభాయాత్రలో ఉషోదయ యూత్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తాడూరి చక్రవర్తి, కార్యదర్శి వడ్లకొండ సోమేష్, కోశాధికారి తాళ్ల నాగరాజు, వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకాంత్, సభ్యులు కరుణాకర్, కనకయ్య, షాదుల్ హుస్సేన్, మహేందర్ రెడ్డి, నాగరాజు, సత్యం, షాదుల్, శ్రీనివాస్, వెంకటేష్, బాబు, సందీప్, కిషోర్, యాదగిరి, భూషణం, రఫీ, శంకర్, అఖిలేష్ రెడ్డి, సంతోష్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.