calender_icon.png 1 February, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్‌కు ఘనమైన నివాళి

01-02-2025 12:00:00 AM

ప్రపంచం గర్వించదగ్గ కళాకారుడు 

గద్వాల, జనవరి 31 ( విజయక్రాంతి ) : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గళమెత్తిన ప్రజా యుద్ధ నౌక  గద్దర్ ప్రపం చం మొత్తం గర్వించదగ్గ కళాకారుడని జిల్లా పౌర సంబంధాల అధికారి మహమ్మద్ అరీఫుద్దీన్ అన్నారు. శుక్రవారం ప్రజా గా యకుడు గద్దర్ జయంతి వేడుకలను వైయ స్‌ఆర్ చౌరస్తా వద్ద రాష్ర్ట సంస్కతిక శాఖ ఆధ్వర్యములో  జిల్లా తెలంగాణ సాంస్కతిక సారథి కళాకారులతొ ఘనంగా నిర్వహిం చడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా సాంస్కతిక సారథి కళాకారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, గద్దర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనం తరం జిల్లా  సాంస్కతిక సారథి కళాకారుల ఆట పాటలతో  గద్దర్ స్వయంగా పాడిన పాటలు,  ఆయన  పై కళాకారులు  రచించిన పాటలు పాడుతూ ప్రజల్లో గద్దర్ యొక్క జ్ఞాపకాలను మననం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా సాంస్కతిక సారథి కళాకారులు రేలారే ప్రసాద్, రమాదేవి, స్వామి, కేశవులు, కష్ణ, హజరత్, రాహుల్, భూపతి, కవిత, ప్రజా సంఘాల నాయ కులు, అఖిల పక్ష కమిటీ నేతలు, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు.

ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చిన వ్యక్తి 

మహబూబ్ నగర్, జనవరి 31 (విజయ క్రాంతి) :  తన ఆటపాటలతో ప్రజలలో చైత న్యాన్ని  రగిలించి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు లో కీలక పాత్ర పోషించిన ప్రజా కవి,ప్రజా గాయకుడు గద్దర్ అని జిల్లా పౌర సంబం ధాల అధికారి పి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవా రం ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ చౌరస్తా,రెడ్ క్రాస్ కార్యాలయం వద్ద  జిల్లా తెలంగాణ సాంస్క తిక సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. 

జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇస్రా నాయక్,రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ లు జిల్లా సాంస్కతిక సారథి కళాకారులతో కలిసి  గద్దర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా  సాంస్కతిక సారథి కళాకారుల ఆట పాటలతో  గద్దర్ స్వయంగా పాడిన పాటలు,  ఆయన  పై కళాకారులు  రచించిన పాటలు పాడుతూ ప్రజల్లో గద్దర్ యొక్క జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సాంస్కతిక సారథి కళాకారులు అశోక చారి, విజయ్ కాంత్, జయ ప్రకాష్, ఉదయ్, ఫ్రాం క్లిన్, సంతోషమ్మ, పద్మ కళాకారులు తదిత రులు పాల్గొన్నారు.

వనపర్తిలో 

వనపర్తి టౌన్, జనవరి 31:- సామాజిక అసమానతలు, తెలంగాణ సాధన కొరకు గళమెత్తిన ప్రజా యుద్ధ నౌక  గద్దర్ గొప్ప కళాకారుడని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారాం అన్నారు. జనవరి, 31 శుక్రవారం ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందు సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జిల్లా సాంస్కతిక కళాకారులు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి గద్దర్ చిత్ర పటానికి పూ ల మాల వేసి ఘనంగా నివాళు లు అర్పించారు.

అనంతరం జి ల్లా  సాంస్కతిక కళాకారుల ఆ ట పాటలతో  ఉదయం నుండి  గద్దర్ స్వయంగా పాడిన పాట లు,  ఆయనపై కళాకారులు ర చించిన పాటలు పాడుతూ ప్రజ ల్లో గద్దర్ యొక్క జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. ప్రజా సంఘాల నాయకులు సతీష్, గంధం నాగరాజ్, చీర్ల చందర్, జిల్లా  సాంస్కతికశాఖ కళాకారులు పాల్గొన్నారు.

గద్దర్ ఆశయాలు నెరవేర్చాలి    

నారాయణపేట, జనవరి 31(విజయ క్రాంతి): సామాజిక అసమానతలు, తెలంగా ణ సాధన కొరకు గళమెత్తిన ప్రజా యుద్ధ నౌక  గద్దర్ గొప్ప కళాకారుడని జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం. ఎ. రషీద్ అన్నా రు. శుక్రవారం ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను మినీ స్టేడియం దగ్గర సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. 

జిల్లా పౌర సంబంధాల అధికా రి, జిల్లా సాంస్కతిక కళాకారులతో కలిసి గద్దర్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనం గా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా  సాంస్కతిక కళాకారుల ఆట పాటలతో  ఉదయం నుండి  గద్దర్ స్వయంగా పాడిన పాటలు,  ఆయన  పై కళాకారులు  రచించిన పాటలు పాడుతూ ప్రజల్లో గద్దర్ యొక్క జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. జిల్లా  సాంస్కతిక శాఖ కళాకారులు పాల్గొన్నారు.