calender_icon.png 22 April, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ కంప్యూటర్ శకుంతలా దేవికి ఘనంగా నివాళి

22-04-2025 12:26:33 AM

పెబ్బేరు ఎప్రిల్ 21: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని తాటిపాముల గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సోమవారం గణిత శాస్త్ర మేధావి, మానవ కంప్యూటర్ శకుంతలా దేవికి ఘణంగా నివాళులు అర్పించారు.ప్రధానోపాధ్యాయులు రాంచంద్రయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఉపాధ్యాయుడు రాయిని పల్లి శ్రీనివాస్ నల్ల బల్ల పై శకుంతలా దేవి చిత్రం గీసి ఆమె చరిత్ర ను విద్యార్థులకు అర్థమయ్యేలా చిత్రించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేఖర్ రెడ్డి, అరుణ కుమారి, శ్రావణ్ కుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.