31-01-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు
పెద్దపల్లి, జనవరి 30: మన దేశ స్వాతంత్య్రం సాధన కోసం పోరాడిన సమరయోధులు, అమర వీరులకు అదనపు కలెక్టర్ వేణు ఘనంగా నివాళులు అర్పించారు. గురువారం కలెక్టరేట్ లో అమరుల దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనవరి 30న అమరుల దినోత్సవం గా నిర్వహిస్తున్నామని, మన దేశ స్వాతంత్రం కోసం విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అనేక మంది అమర వీరులను స్మరిస్తూ మౌనం పాటించారు.
ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ బండి ప్రకాష్, ఎడి. శ్రీనివాస్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, డివైఎస్ ఓ సురేష్ , డివిహెచ్ ఓ శంకర్, బీసీ వెల్ఫేర్ అధికారి రి రంగారెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.