15-04-2025 12:00:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్, ముషీరాబాద్, భోల క్పూర్, కవాడిగూడ, రాంనగర్, అడిక్మెట్ డివిజన్లో పలు పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన ంగా నివాళులర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మె ల్యే ముఠాగోపాల్, బిజెపి అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ముటా జయసింహ, వివిధ పా ర్టీల నాయకులు పాల్గొని అంబేడ్కర్ కు నివాళులు అర్పించారు.