14-04-2025 05:13:54 PM
మంచిర్యాల (విజయక్రాంతి): భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 134వ జయంతిని సోమవారం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఏసీసీ వద్ద గల అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజావేణు, జిల్లా ఉపాధ్యక్షులు వి కిరణ్ కుమార్, వీఓటీటీ జిల్లా కన్వీనర్ యు తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.