calender_icon.png 28 December, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానేతకు ఘన నివాళి అర్పించాలి

22-12-2024 01:50:07 AM

  1. వాజపేయ్ 100వ జయంతిని ఘనంగా నిర్వహించాలి
  2. పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మాజీ ప్రధాని వాజపేయ్ 100వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించను న్నట్టు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు.

వాజపేయ్ శత జయంతి ఏర్పాట్లపై శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. మహానేతకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘన నివాళి అర్పించాలని కోరారు. ఈ సమీక్షలో బీజేపీ సంస్థాగత రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి, వివిధ మోర్ఛాల అధ్యక్షులు పాల్గొన్నారు.