10-02-2025 07:33:41 PM
మునగాల: మునగాల మండల కేంద్రములో సాయి గాయత్రి విద్యాలయాలు సైన్స్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని వివిధ తరగతులకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి పి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పుర ప్రముఖులు అధికారులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులచే తయారు చేయబడిన విద్యా అంశాలను పరిశీలించి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సుమారుగా 100 నమూనాలను తయారుచేసి విద్యార్థులు అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమాన్ని తిలకించి విద్యార్థులను ఆశీర్వదించిన పెద్దలందరికీ పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఉషారాణి ఏవో ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... పిల్లలు భావిభారత పౌరులు వారి సృజనాత్మకత దేశానికి ఎంతో అవసరమని ఇలాంటి నూతన ఆవిష్కరణలు మరెన్నో చేసి విద్యార్థులు దేశాన్ని అభివృద్ధి పథకం వైపు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ పిల్లలందరినీ అభినందించారు.