పారిశుద్ధ్య కార్మికులకు పిపికిట్లు పంపిణీ, హెల్త్ చెకప్
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేసింగ్ ఆఫ్ తెలంగాణగా సంవత్సర కాలంలోనే నిలబెట్టిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. అందులో భాగంగా మంగళవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జగదాంబ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కోరం కనకయ్య జెండా ఊపి విజయోత్సవ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ నందు పి పి ఈ కిట్లు, హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య, మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు కార్మికులకు అందజేశారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ వంటల ప్రదర్శనను సందర్శించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరకాలం కావస్తున్నందున రాష్ట్రమంతట పండుగలాగా నిర్వహించేందుకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని ఒక్కొకటిగా నెరవేస్తున్నామని ప్రజలకు గుర్తు చేశారు. అతి త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో భాగంగా మన పట్టణాన్ని మనమందరం పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు అతి త్వరలో ఏరియల్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, మేనేజర్ అంకు షావలి, డిఈ మురళి, విజయోత్సవాల ఇంచార్జ్ స్వరూప, మాజీ మున్సిపల్ చైర్మన్ అనసూర్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్, మున్సిపల్ కౌన్సిలర్లు వారా రవి, కటకం పద్మావతి, కొక్కు నాగేశ్వరరావు, సయ్యద్ ఆజం, గిన్నారపు రజిత, అంకె పాక నవీన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి, బంకు శీను, బోళ్ల సూర్యం, గోచికొండ శ్రీదేవి, మహిళా అధ్యక్షులు స్వరూప, ఏ ఓ శ్రీనివాస్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.