calender_icon.png 9 April, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా శోభాయాత్ర

07-04-2025 01:36:06 AM

  1. సీతారామ్ బాగ్ నుంచి కోఠి వ్యాయామశాల వరకు.. 
  2. ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పూజలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగ రం ఆదివారం కాషాయమయమైంది. భాగ్యనగర్ శ్రీరామ నవ మి ఉత్సవ సమితి, పలు హిందూ సంఘాలు, గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరా మ నవమి శోభాయాత్ర ఆదివా రం హైదరాబాద్ నగరంలో వైభవంగా జరిగింది. 

సీతారామ్‌భాగ్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంట కు ప్రారంభమైన శోభాయాత్ర బోయిగూడ కమాన్, గంగాబౌళి క్రాస్‌రోడ్, గాంధీ స్టాచ్యూ, బేగం బజార్, శంకర్ హోటల్, పుత్లీ బౌలి క్రాస్‌రోడ్, ఆంధ్రాబాంక్, డీఎంఅండ్‌హెచ్‌ఎస్ జంక్షన్, హనుమాన్ టెక్డిలేన్, మీదుగా కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగింది.

శోభాయాత్ర సందర్భంగా ఆ వీధు ల్లో పలు సంఘాల ఆధ్వర్యంలో  ప్రత్యేక వా హనాలపై శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడు, లక్ష్మణుడు, తదితర దేవతా మూర్తు ల విగ్రహాలతో ర్యాలీ నిర్వహించారు. అంత కు ముందు సీతారాంబాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్‌మర్మ ప్రత్యేక పూజలు చేశారు.

భక్తులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ పౌరుడు శ్రీరాముడిని ఆదర్శం గా తీసుకోవాలని సూచించారు. అనంతరం జరిగిన శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బేగంబజార్ నుంచి గోవర్ధన్ పీఠ్ జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ అదోక్ష్‌జనద్ దేవ్ తీర్థమహారాజ్, త్రిపుర డిప్యూటీ స్పీకర్ రా మ ప్రసాద్ పాల్ భాగ్యనగర్ శ్రీరామ నవ మి ఉత్సవ సమితీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. శోభాయాత్రకు హిందూ సం ఘాలు స్వాగతం పలికాయి.

పలు సంఘాల వారు భక్తులకు దారిపొడవునా.. అన్న ప్రసాదాలు, తినుబండారాలు, మంచినీరు, మజ్జి గ, శీతల పానియాలు, అందజేశారు. శోభాయాత్ర సందర్భంగా అవాంఛనీయ సంఘ టనలు జరుగకుండా అడుగడుగునా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. 20 వేల మం దితో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

శోభాయాత్ర మార్గంలో పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బందోబస్తును పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో లాఅం డ్‌ఆర్డర్ అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్, డీసీ పీలు, పోలీసులకు సూచనలు చేశారు. 

మారుమోగిన డీజేలు

శోభాయాత్రలో ఆబాలగోపాలం పాల్గొ నే అవకాశమున్నందున డీజేలు వినియోగించొద్దని పోలీసులు సూచనలు చేశారు. భాగ్య నగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి సహా హిందూ సంఘాలు కూడా దీన్ని స్వాగతించాయి. కానీ పలువురు అత్యుత్సాహంతో డీ జేలను వినియోగించారు. దీంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు అసౌకర్యానికి గురయ్యారు.