calender_icon.png 4 January, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెస్ క్లబ్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

01-01-2025 05:30:53 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గాండ్ల సంజీవ్, కడారి శ్రీధర్ లు కేక్ కట్ చేసి పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరికీ మంచి జరగాలని అందరి కోరికలు ఆశయాలు నెరవేరాలని వారు ఆకాంక్షించారు. ప్రెస్ క్లబ్ నిరంతరం పాత్రికేయుల హక్కుల కోసం, సంక్షేమం కోసం కృషి చేస్తుందని, పాత్రికేయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. జిల్లాలోని పట్టణ ప్రెస్ క్లబ్ కు ఒక మంచి పేరు ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పాత్రికేయులు పాల్గొన్నారు.