03-04-2025 12:00:00 AM
గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించిన సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): జై బాపు,జై భీమ్,జై సంవిదాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ కోతిరాంపూర్ లోని గాంధీ విగ్రహం నుండి ఘనంగా ప్రారంభించి 9,10,31,32,50 డివిజన్ల మీదుగా కొనసాగించి కమాన్ కూడలి వద్ద ముగించారు.
ఈ సందర్భంగా పాదయాత్రను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై వంద సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా జై బాపు అని పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ ను అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అందుకే జై భీమ్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్న వారికి వ్యతిరేకంగా జై సంవిధాన్ అభియాన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు.
ఈ పాదయాత్రలో కరీంనగర్ నియోజక వర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్ ఎస్ సి సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, కుర్ర పోచయ్యా,గంగుల దిలీప్, కోడూరి రవీందర్ గౌడ్,మాజీ కార్పొరేటర్స్ భోమన్న, ఉమాపతి, నీతికుంట యాదన్న, సరిల్లా ప్రసాద్, బుచ్చి రెడ్డి,గంట కళ్యాణి శ్రీనివాస్,చెర్ల పద్మ, మహాదేవుని భార్గవి, వంగల సాగర్,నవాబ్ భాయ్, దన్న సింగ్, వాడే వెంకట్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, గుండటి శ్రీనివాస్ రెడ్డి,నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లినగర్‌లో..
కొత్తపల్లి, ఏప్రిల్ 2: కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో కాంగ్రెస్ నాయకులు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పురమళ్ళ శ్రీనివాస్ మరియు నాయకులు పాల్గొన్నారు.