హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 25 (విజయక్రాంతి): లోయోలా అకాడమీ 9వ గ్రాడ్యుయేషన్ డే శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 2023 -24 ఏడాదిలో ఉత్తీర్ణులైన 1,167 మంది పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేయగా, అందులో 987 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, 180 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వీ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, మానవీయ విలువలతో ఉండాలన్నారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ భవిష్యత్‌లో మరింత ప్రభావం చూపుతుందని వివరించారు.
ఓయూ ప్రొ. శశికాంత్, లయోలా కళా శాల సంచాలకులు రెవ. ఫా. డాక్టర్ ఎ. ఫ్రాన్సిస్ జావియర్, ప్రిన్సిపాల్ రెవ. ఫా డాక్టర్ ఎన్ బీ బాబు, రెవ. ఫా డాక్టర్ ఎల్‌ఎం థామస్, రెవ ఫా డాక్టర్ ఎఎం జోసెఫ్ కుమార్, రెవ ఫా ఎం అరుల్ జ్యోతి, రెవ ఫా ప్రభు ఆంథోనీ, పీ సుధాకర్, డాక్టర్ కేశ్రీనివాస్, డాక్టర్ పీ హిమబిందు, డాక్టర్ కేఈచీ విద్యాసాగర్, ప్రొఫెసర్ సక్రం తదితరులు పాల్గొన్నారు.