29-03-2025 10:41:34 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలతో శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ఆర్డిఓ హరికృష్ణ ఆధ్వర్యంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి ముస్లింలకు పండ్లు, ఖర్జూరాలు తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం హిందూ, ముస్లింల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించేందుకు అధికారికంగా అన్ని ప్రాంతాలలో ఇఫ్తార్ విందు కోసం నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందులో హిందూ ముస్లిం లు పాల్గొని మతసామరస్యానికి పూర్తిగా నిలవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు చిలుముల శంకర్, నాయకులు మత్తమారి సత్తిబాబు, కంకటి శ్రీనివాస్ తోపాటు పలువురు కాంగ్రెస్ ,ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. l