30-04-2025 05:14:52 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలందించి పదవి విరమణ పొందిన ఐదుగురు పోలీసులను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్(District SP Sudhir Ramnath Kekan) ఘనంగా సత్కరించారు. ఏఎస్ఐ లు భూక్య కిషన్, సోమ కుమారస్వామి, మహమ్మద్ అహ్మద్, పెద్దిరెడ్డి రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణపాక పాపయ్య బుధవారం పదవి విరమణ చేయగా వారిని జిల్లా పోలీసు శాఖ తరపున శాలువాలు మేమెంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజలకు భద్రత కల్పిస్తూ, అంకితభావంగా సేవలందించిన వారిని ప్రజలు ఎప్పుడు గుర్తించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు తిరుపతిరావు, గండ్రతి మోహన్, విజయ్ ప్రతాప్, సిఐ లు నరేందర్, సర్వయ్య, సత్యనారాయణ, ఆర్ ఐలు నాగేశ్వరరావు అనిల్ పాల్గొన్నారు.