10-04-2025 07:13:59 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన సుజాత-రమేష్ దంపతుల కుమారుడు దుర్గం క్రాంతి 552.5 ర్యాంకు సాధించి గ్రూప్-1 ఉద్యోగం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఫ్రెండ్స్ సేవింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించి సంస్థ సభ్యులు మాట్లాడారు. ప్రాథమిక విద్యలో తల్లిదండ్రులు కష్టాలను గుర్తించుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉండాలనే లక్ష్యంతో పదో తరగతిలో 9.7 జిపిఎ సాధించి తిరుపతిలో డిప్లమో మైనింగ్ పూర్తిచేసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, 30 వేల ట్యాప్ అందుకున్నారని వారు గుర్తుచేశారు.
అనంతరం సింగరేణిలో ఓవర్ మెన్ ఉద్యోగం సాధించి ఉద్యోగం చేస్తూనే బీటెక్ పూర్తి చేసి ఎన్నో కష్టాలను భరిస్తూ ఈరోజు గ్రూప్-1 సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడన్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించినందుకు ఉన్నత స్థాయి ఉద్యోగంతో వారికి మంచి బహుమతి అందించాడని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవింగ్ సొసైటీ సభ్యులు శనిగారపు కుమార్, దుర్గం స్వామి, కాదాసి రవీందర్, కోల రాజేష్, దుర్గం రవి, గొర్ల శ్రీనివాస్, పూసాల సంపత్ లు పాల్గొన్నారు.