05-04-2025 07:03:46 PM
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కాసిపేట్-2 గనిలో రక్షణ ఓవర్ మెన్ గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సెగ్గం శ్రీనివాస్ ని ఘనంగా సన్మానించారు. శనివారం గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిబిజికేఎస్, ఎస్సీ ఎస్టీ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... అధికారులకు బదిలీలు సహజమని, గనిలో అందరితో కలివిడిగా ఉండే అధికారి బదిలీపై వెళ్లడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో టిబిజికేఎస్ నాయకులు ప్రతాప్ సారంగపాణి, వెంకటేష్, సింగతి కృష్ణ, యాదగిరి, సత్య ప్రసాద్, రాజ్ కుమార్, తిరుపతి, అర్జున్, వెంకటేష్ పసిక, మేకల రమేష్, కుమార్, శ్రీను, అజ్మీరా మహేష్, విశాల్, మారం రమేష్, ఎస్సీ ఎస్టీ నాయకులు కండే నవీన్ , నాయిని శ్రీనివాస్, కనకం రమేష్, అవునూరి రవి లు పాల్గొన్నారు.