calender_icon.png 22 March, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైనీ కలెక్టర్‌కు ఘన సత్కారం

22-03-2025 01:39:02 AM

నారాయణపేట. మార్చి 21(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా కు గతేడాది ఏప్రిల్ లో శిక్షణ కోసం వచ్చి తిరిగి వెళ్తున్న ట్రైనీ కలెక్టర్ గరిమా నరులకు శుక్రవారం సాయoత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికి పూల మాల, పుష్ప గుచ్చాలతో ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బేన్ షాలొమ్, సంచిత్ గ్యాంగ్వర్, ఆర్డీఓ రామచంద్ర నాయక్ తో పాటు పలువురు జిల్లా అధికారులు ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల తో విధి నిర్వహణలో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

శిక్షణాకాలంలో గరిమా నరుల చూపిన నిబద్ధత, చిత్తశుద్ధిని అదనపు కలెక్టర్లు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో జయసుధ, జెడ్పి సీఈవో భాగ్యలక్ష్మి, డిప్యూటీ సీఈవో జ్యోతి, డిటీలు అఖిల ప్రసన్న, రాణీ దేవి, డిఆర్డిఓ మొగులప్ప, డిపిఓ కృష్ణ, సిపిఓ యోగానంద్, డి ఎ వో జాన్ సుధాకర్, పి ఆర్ ఈ ఈ హీర్యా నాయక్, డీ ఈ ఓ గోవిందరాజులు, మిషన్ భగీరథ ఈ ఈ రంగారావు, సాంఘిక సంక్షేమ అధికారి ఉమా పతి, తహాసిల్దార్లు, ఎంపీడీవోలు, కలెక్టరేట్ లోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.