calender_icon.png 20 March, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ స్టూడెంట్స్ కు ఘనంగా వీడ్కోలు

19-03-2025 11:22:37 PM

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాల జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. వారు తమ గుర్తుగా పాఠశాలకు పోడియాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.

క్రమశిక్షణతో ఉంటూ భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆమె ఆశీర్వదించారు. అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ... విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై గ్రామం పేరు నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, ప్రాథమిక పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ ఛైర్ పర్సన్ పద్మ, గుండ్ల రాజు, రాజశేఖర్, విజయలక్ష్మి, మోహన్, దేవేందర్ రావు, సాయి కుమార్, బాలేశం, అనిత, స్వరూప ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.