19-03-2025 04:28:37 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లినప్పుడే ఉపాధ్యాయులకు గర్వంగా ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన కోరారు.
ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఆ రంగాలలో ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్టిఓ అధ్యక్షులు కుశాల్ కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, సామాజిక కార్యకర్త పట్లోళ్ల కిషోర్ కుమార్, నిజాంసాగర్ మండలం విద్యాధికారి తిరుపతిరెడ్డి, మహమ్మద్ నగర్ మండల విద్యాధికారి అమర్ సింగ్, బాన్సువాడ పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు పాఠశాల ఉపాధ్యాయులు జోసెఫ్, సమత, ప్రవీణ్ కుమార్, రమాదేవి, సంతోష్ కుమార్ హిమబిందు, జావిద్, సంతోష్, సిఆర్పి శ్రీధర్ కుమార్, వరలక్ష్మి పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.