25-03-2025 08:04:14 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ మర్కల్ గ్రామ శివారులో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ తృతీయ సంవత్సర విద్యార్థులకు కోర్సు పూర్తి చేసుకుని కళాశాలను వీడుతున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. విద్యార్థులు కాలేజీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.సి. శోభారాణి మాట్లాడుతూ... పూర్వ విద్యార్థులు కళాశాలకు ఆస్తి లాంటి వారని, కళాశాల పేరును నిలబెట్టేవారని తెలిపారు. విద్యార్థులు ప్రతికూలతలను అనుకూలతలుగా మలచుకొని లక్ష్యం దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటుగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ సీ హెచ్.మీన, డా. డి.శ్రావణి, అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్థులు నృత్యాలతో సందడి చేసారు.