calender_icon.png 23 October, 2024 | 8:56 AM

బొజ్జ గణపతికి ఘనంగా వీడ్కోలు

18-09-2024 03:00:48 AM

లక్కీ డ్రాలో 111 కిలోల లడ్డు 

మంచిర్యాల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి) : పదకొండు రోజులపాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడికి మంగళవారం వీడ్కోలు పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య గణనాథుల శోభయాత్రను నిర్వహించి జలాశయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీ నగర్ వందఫీట్ల రోడ్డులో అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యం లో వినాయకుడి మంటపం ఏర్పాటు చేశారు.

గణేషుడి లడ్డుకు మంగళవారం సాయంత్రం నిర్వహించిన లక్కీ డ్రాలో మంచిర్యాలవాసి దక్కించుకున్నాడు. 111 కిలోల లడ్డుకు లక్కీ డ్రా ద్వారా అందజేస్తామని ప్రకటించ గా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు రూ.10 విలువైన 12 వేలకుపైగా టోకెన్‌లను కొని డబ్బాలో వేశారు. అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, డైరెక్టర్ పిల్లి రవిలు లక్కీ డీప్ తీయగా మంచిర్యాలకు చెందిన చి ందం చరణ్ తేజకు లడ్డు దక్కింది. 

మహారాష్ట్రలో లడ్డు దక్కించుకున్న వైద్యులు 

నిర్మల్(విజయక్రాంతి): మహారాష్ట్రలోని భోకర్ తాలుకా పాలజ్ గ్రామంలో వినాయకుడి లడ్డూకు మంగళవారం వేలం నిర్వహి ంచారు. నిర్మల్‌కు చెందిన వైద్య దంపతులు నాలం శశికాంత్, స్వప్న రూ.1.26లక్షలు పాట పాడి లడ్డును దక్కించుకున్నారు.