calender_icon.png 4 April, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీపై వెళ్లిన విద్యాధికారికి ఘనంగా వీడ్కోలు

27-03-2025 06:44:16 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రములోని మండల వనరుల కార్యాలయంలో విద్యాధికారి ఉదయ భాస్కార్ రెడ్డి బదిలీపై ములుగు మండలానికి వెళ్ళగా వారి స్థానంలో నూతనంగా వచ్చిన విద్యాధికారి మాధవరెడ్డి లకు జగదేవపూర్ మండల సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో వీడ్కోలు మరియు స్వాగత సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష మండల అధ్యక్షులు దయానంద్ మాట్లాడుతూ... బదిలీపై వెళ్ళన విద్యాధికారి మండలంలో పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రధాన కార్యదర్శి ఆకుల కరుణాకర్, కోశాధికారి రమణ కుమార్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, పిఆర్టియు మండల అధ్యక్షులు వెంకట్ రాం రెడ్డి, మండలంలోని ఉపాధ్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.