మేడ్చల్ (విజయక్రాంతి): గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మైసమ్మ గూడ లోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ టివి రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుందని క్రిస్మస్ అనేది మేరీ ద్వారా జీసెస్ ఈ ప్రపంచానికి పంపిన రోజు అని ఒక చిన్న పశువుల పాకలో జన్మించారని, క్రిస్మస్ ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం సంతోషాన్ని పంచుకోవడం అనేది అని తెలిపారు. ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ చదువులో కూడా మీరు మంచిగా రాణించాలని ఆకాంక్షించారు.
అకడమిక్ డైరెక్టర్ సరోజ రెడ్డి మాట్లాడుతూ.. బేబీ జీసస్ పుట్టినరోజు పురస్కరించమని క్రిస్మస్ గా జరుపుకుంటామని ఒకరికొకరు సంతోషాన్ని పంచుకోవడం ద్వారా, థాంక్స్ గివింగ్ అనే కార్యక్రమం ద్వారా బియ్యం, బట్టలు, తదితర నిత్యవసర వస్తువులు ఇవ్వడం ద్వారా వీటిని వృద్ధాశ్రమాలకు, అనాధ పిల్లలకు విరాళాలుగా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ థాంక్స్ గివింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వారిని అభినందించారు. విద్యార్థినీ, విద్యార్థులు పాటలతో ఆకట్టుకున్నారు. శాంతా క్లాస్ అభివాదం చేస్తూ విద్యార్థులకు స్వీట్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ టివి రెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీలత, అకడమిక్ డైరెక్టర్ సరోజ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ అనురాగ్ రెడ్డి, పి ఆర్వో రవి, సుధాకర్, వివిధ భాగాధిపతులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.