16-12-2024 07:47:50 PM
కూకట్ పల్లి (విజయక్రాంతి): కేసిఆర్ ప్రభుత్వ హయాంలో క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే వారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం పాస్టర్ లకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. అన్ని మతాలను ప్రోత్సహిస్తూ కేసీఆర్ కులమతాలకు అతీతంగా బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రేవంత్ ప్రభుత్వంలో బతుకమ్మకు ఆడపడుచులకు చీరలు లేవు పాస్టర్లకు బట్టలు లేవని ఆరోపించారు.
నియోజకవర్గ పరిధిలోని తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటా అన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్టియన్ సోదరులకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, మందాడి శ్రీనివాస్ రావు, రోజా దేవి రంగారావు, సబిహ గౌసుద్దీన్, మహేశ్వరి, స్థానిక నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, బాబురావు, మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు.