07-04-2025 10:52:46 PM
రథోత్సవంలో పాల్గొన్న పలువురు భక్తులు..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నాడు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారిని రథం మీద ఊరేగించి రథోత్సవం నిర్వహించారు. భద్రాచలం రామాలయం నుండి తాత గుడి సెంటర్ వరకు తిరిగి రామాలయం వరకు ఈ రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి, దేవస్థానం అధికారులు శ్రావణ్ కుమార్, రవీంద్ర, శ్రీనివాస్ రెడ్డి సాయిబాబాతో పాటు పలువురు అర్చకులు పాల్గొన్నారు.