calender_icon.png 19 April, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా సీతారామచంద్ర స్వామి ఎదుర్కోలు మహోత్సవం

05-04-2025 12:00:00 AM

కరీంనగర్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): నగరంలోని సప్తగిరి కాలనీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా క్రిస్టియన్ కాలనీలోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి స్వగృహన వారి పరివారంతో కలిసి ఏర్పాటు చేసిన ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని,  చక్కటి పరిపాలనకు నాంది అని స్వామి మరియ స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన గాని, చూసినా గాని, విన్నా గానీ, ప్రచారం చేసినా గాని అన్ని రంగాలలో విజయం సాధ్యమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

లోక కళ్యాణార్థమై శ్రీరాముడు ఉద్భవించాడని, ప్రజల రక్షణకై ఎల్లప్పుడూ  ఉంటాడని, స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన వారికి సకల శుభాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.