17-03-2025 01:55:55 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ , మార్చి 16(విజయ క్రాంతి):పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక పొట్టి శ్రీరాములు చౌక్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు పాత శ్రీనివాస్, క్లబ్ అంతర్జాతీయ సంఘం సభ్యులు గంధం శ్రీనివాస్ గుండా ప్రమోద్ చిలువేరి వెంకటేశ్వర్లు, కోడిపాక వేణుగోపాల్, రావుల శంకర్, కాచం మధుకర్, అరవింద అమూల్ గోగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు