calender_icon.png 16 March, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పొట్టి శ్రీరాములు 124వ జయంతి

16-03-2025 06:14:39 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వాసవి క్లబ్ గ్రేటర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ‌ జయంతి ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక రచ్చబండ దగ్గర ఎంపిడిఓ కార్యాలయంలో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లులు అర్పించడం జరిగింది. తెలుగువారి కోసం పోరాడిన మహాపురుషుడు భాష ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆమరణ నిరాహారదీక్ష వారి త్యాగం మరువు లేనిది, ఆర్యవైశ్య పెద్దలు అన్నారు.   

ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వంగవేటి వెంకట గురుమూర్తి, వాసవి క్లబ్ మండల అధ్యక్షులు అర్వపల్లి ప్రవీణ్ కుమార్, జోనల్ చైర్మన్ కాపర్తి మణికంఠ కుమార్ ఆర్యవైశ్య పెద్దలు పివిడి ప్రసాద్, గన్నవరపు వెంకన్న, మండల వాసవి క్లబ్ కార్యదర్శి బ్రాహ్మదేవర అఖిల్, మండల వాసవి క్లబ్ ట్రెజరర్ కందిబండ సతీష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.