28-08-2024 12:25:52 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ 36వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఆసుపత్రి ఆవరణలో ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో సంస్థల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, వైస్ చైర్‌పర్సన్ ఉపాసన హాజరై జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అపోలో హాస్పిటల్స్ 36 సంవత్సరాల ప్రయాణాన్ని వర్ణి స్తూ.. చిన్నారులు ప్రదర్శించిన స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సీఈవో తేజస్వీరావు, సీఓఓ హరకరన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.