calender_icon.png 27 April, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

26-04-2025 10:10:25 PM

దేవరకొండ: కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో 2007-2008 విద్యా సంవత్సరానికి చెందిన కొండమల్లేపల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో పదవ తరగతి  విద్యనభ్యసించిన విద్యార్థినీ విద్యార్థులు శనివారం రోజు కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలోని సాగర్ రోడ్డులో గల కె ఆర్ కె  ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందోత్సాహాల నడుమ ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకోవడం జరిగింది.

ముందుగా జ్యోతి ప్రజ్వలన, ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన మృతులకు నివాళులర్పించి, మౌనం పాటించి జాతీయ గీతాలపనతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ... విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే విద్యను బోధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నిజమైన ఆనందం కలుగుతుందని,ఇదే స్ఫూర్తితో సమాజంలో పలు రకాల సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పల్లా వెంకట్ రెడ్డి ఉపాధ్యాయులు దామెర మురళి, వనం చంద్రమౌళి, జల్దా జయరాములు, వెంకటేశ్వర్లు, బాల్ రెడ్డి, వెంకట్ నారాయణ, చంద్రయ్య, రేపాలా శ్రీనివాస్, విద్యార్థినీ విద్యార్థులు సైదులు, నర్సింహా నారాయణమ్మ, రేఖ, అంజనేయులు, వెంకటేష్, ఇసాక్, రామకృష్ణ మహేష్, సాలయ్య, మమత సుజాత, రవిన్, తిరుమల్ నాథ్, నవీంద్ర చారి, శివ, తదితరులు పాల్గొన్నారు.