calender_icon.png 22 April, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

21-04-2025 12:36:40 AM

నాగారం, ఏప్రిల్ 20: నాగారం మండల పరిధిలోని ఈటూరు గ్రామం లోఈటూరు డెవలప్మెంట్ సొసైటీఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగాగత 25 సంవత్సరాలుగాపాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులను శాలువాలతో సత్కరించారు.సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం డా. బండి సాయన్న మాట్లాడుతూఈటూరు పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

గ్రామంలోని ప్రతి పిల్లవాడు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే విధంగా వసతుల కల్పనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అభివృద్ధి పథంలో నడుస్తున్న పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పాఠశాలలో పదవ తరగతిలో ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులకు గోల్ మెడలో అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుండు కిష్టయ్య ఎంఈఓ ప్రభాకర్ కే ఉప్పలయ్య కే బ్రహ్మచారి  సోమిరెడ్డి  దామోదర్ కన్నెబోయినరాముయాదవ్  యాదగిరి ఎల్లాచారి శ్రావణ్ కుమార్ గోపి పూలమ్మ సోమయ్య సతీష్ సురేష్ గణేష్ గిరి పాల్గొన్నారు