calender_icon.png 23 April, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

14-04-2025 12:00:00 AM

నాగారం, ఏప్రిల్ 13: నాగారం మండలంలోని ఫణిగిరి గ్రామంలో ఆదివారం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణంలో పదవ తరగతి బ్యాచ్ 1985-1986 పూర్వ విద్యార్థుల 2 వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. తమ గురువులు శర్మ, వెంకట్ రెడ్డి, నరసింహారెడ్డి, మల్లయ్య, సుదర్శన్ లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

మా జీవితములో స్నేహం మరపురాని తీపి జ్ఞాపకమని, చదువుకున్న స్నేహితులను కలుసుకోవడం అదృష్టం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవిలయ్య, సుధాకర్, వీర మల్లయ్య, కడారి పద్మయ్య, రజిత, శోభ, పద్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు