23-03-2025 08:07:05 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008-09 విద్యా సంవత్సరంలో 10వ తరగతి విద్యానభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు అతిది గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి చిన్నానాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి, ప్రసన్న, శ్రీనివాస్, విద్యార్థులు నవెందర్, చాకలి రాజు, ధర్మరాజు, అశోక్, విష్ణు, పాషా, వినోద, తదితరులు పాల్గొన్నారు.