calender_icon.png 2 January, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి

30-12-2024 08:13:12 PM

న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి 

మీ పోరాటానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది 

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు సోమవారం సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులు లేనిదే విద్యా వ్యవస్థ లేదని అలాంటి వారి సమస్యలను పరిష్కరించవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, స్వచ్ఛంద సేవా సంస్థల జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉప్పునూతల నాగరాజు గడ్ మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరం వద్దకు వచ్చి మీ సమస్యను పరిష్కరించడం నేను ముఖ్యమంత్రిని అయితే టీ తాగిన సమయం సరిపోతుందని చెప్పిన రేవంత్ నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయి సంవత్సరం గడిచిపోతున్న వీరికి ఇచ్చిన మాటను మరిచిపోయారన్నారు.

విద్య వ్యవస్థలో వీరు లేనిదే జిల్లా విద్యాశాఖ అధికారి సైతం ఏ పని చేయలేరని ఏ పనికైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల ముఖ్యులు అన్నారు. నేడు వీరు సమ్మెలో ఉండడం వల్ల మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వెలవెలబోతుందన్నారు అక్కడ ఏ పనులు జరగడం లేదని వెంటనే ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మ జిల్లా అధ్యక్షులు శరత్చంద్ర,  జిల్లా కోశాధికారి నిస్సి సాంసంన్, రాష్ట్ర నాయకులు శివరాత్రి యాదగిరి, ఆనందరావు, జిల్లా నాయకులు శ్రీనివాస్ రాజారాం, రాజు,  చంద్రశేఖర్, భాస్కర్, రమేష్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్ రాములు, శైలజ, సంతోష్ రెడ్డి, కాళిదాసు, వనజ, మంగా, శ్రీవాణి, కళ్యాణ్, సంధ్య, లింగం, కృష్ణ, దినేష్, వీణ, లావణ్య 500 మంది సభ్యులు పాల్గొన్నారు.