మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, ఆగస్టు 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోవడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. రాష్ట్రంలో డెంగ్యూతో రోజుకు కనీసం ఐదు మంది చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేటలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను గాలికి వది లి.. పీసీసీ, మంత్రివర్గ విస్తరణ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీచే యాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.50వేలు విడుదల చేయాలని కోరారు. అనంతరం సిద్దిపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.