calender_icon.png 3 October, 2024 | 6:00 AM

రైతులకు భరోసా ఇవ్వలేని ప్రభుత్వం

03-10-2024 01:40:33 AM

 తుమ్మల మంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది

 రైతులను ఆదుకోవాలని సీఎంకు ఏలేటి లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రైతులకు భరోసా ఇవ్వ లేని స్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రైతులను ఆదుకోవాలని ప్రజాప్రతినిధుల పక్షాన సీఎంకు ఏలేటి బహిరంగ లేఖ రాశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ర్ట కార్యా లయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు దీక్షతో బీజేపీ అన్నదాతలకు భరోసా కల్పించిందన్నారు.

తమ దీక్షతో అయినా సర్కా రు దిగివచ్చి అన్నదాతలకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పా రు. సొంత జిల్లా ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో మంత్రి తుమ్మల ఉన్నారని విమర్శించారు. ఓ మంత్రిగా ఆయన పూర్తిగా వైఫల్యం చెందారని, ఆయన పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదని ఎద్దేవా చేశారు.

రాష్ర్టం లో రైతు లందరికీ రూ.2 లక్షల రుణమాఫీ అయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించా రు. ఇప్పటి వరకు చేసిన రైతు రుణమాఫీ వివరాలు బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు మంత్రులకే క్లారిటీ లేదని విమర్శించారు. రాష్ర్టం లో కాంగ్రెస్ అరాచక ప్రభు త్వం నడుస్తోందని, దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ మెడలు వంచేలా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.