calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి కట్టుబడి ఉన్న సర్కారు

16-04-2025 12:19:17 AM

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 

రాజేంద్రనగర్, ఏప్రిల్ 16: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ వద్ద హెచ్ ఎం డబ్ల్యూ  ఆధ్వర్యంలో రూ.82.16 కోట్లతో  హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వద్ద నిర్మించనున్న 20 ఎం ఎల్ డి సామర్థ్యం గల ఎస్ టీ పి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు, రూ.21.86 కోట్ల తో 6 ఎం ఎల్ డి సామర్థ్యం గల ఎస్ టీ పి నిర్మాణలకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి వసతులు, వీధి లైట్స్ ఏర్పాట్లలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

కాంట్రాక్టర్లు ఉన్నత ప్రమాణాలు, పనుల్లో నాణ్యత ను పాటించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం ఓ మోడల్ గా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, మాజీ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.