calender_icon.png 18 January, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాకీలో శుభారంభం

09-09-2024 03:14:52 AM

తొలి మ్యాచ్‌లో చైనాను చిత్తు చేసిన ఇండియా

మోకి: చైనాలో జరుగుతున్న ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా హాకీ జట్టు సత్తా చాటింది. మొన్నే పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి ఊపు మీదున్న భారత్ ఆతిథ్య చైనాను చిత్తు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత బృందం 3 తేడాతో చైనాను మట్టికరిపించింది. భారత్ తరఫున సుఖ్‌జీత్ సింగ్ (14వ నిమి షం), ఉత్తమ్ సింగ్ (27వ నిమిషం), అభిషేక్ (32వ నిమిషం) గోల్స్ చేశారు. తొలి క్వార్టర్ ముగిసే సమయానికి సుఖ్‌జీత్ గోల్ సాధించి ఇండియాను ఆధిక్యంలో నిలిపాడు. రెండో క్వార్టర్ ముగుస్తుందనే సమయంలో ఉత్తమ్ సింగ్.. మూడో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే అభిషేక్ గోల్స్ సాధించారు. భారత్ నేడు జపాన్‌తో తలపడనుంది.