భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుం టాయి. కొన్నిసార్లు అహం అడ్డం వస్తుంది. ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటన్నింటినీ పరిష్కరించుకుంటేనే బంధం పదిలంగా మారుతుంది. కొన్నిసార్లు కోపంలోనో, యథాలాపనంగానో కొన్ని మాటలు వచ్చేస్తుం టాయి. ఒకవేళ మీ భాగస్వామి అలా మాట్లాడితే వాటినే పట్టుకుని వేలాడొద్దు.
అవి అంత పెద్ద విషయాలు కానప్పుడు అవతలి వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తేలిగ్గా వదిలేయాలి. అలాగే అభిప్రా య భేదాలు వచ్చినప్పుడు అలగడం సహజమే అయినా.. దాన్ని తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొ ద్దు. వీలైతే నేరుగానే ప్రస్తావించి పరిష్కరించుకోండి.
లేదంటే ఇద్దరి మధ్య అగాథం మరింత పెరిగిపోతుంది. సమ స్య ఏదైనా సరే ఎదుటివారికి చెప్పే అవకాశం ఇవ్వాలి. వారు చెప్పేది పూర్తి గా వినాలి. ఆ తర్వాత సమాధానమో, సంజాయిషీనో ఉండాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారితో రోజురోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.