calender_icon.png 13 January, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలికాలంలో సరెన స్నానం

30-11-2024 12:00:00 AM

నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం శరీరానికి మంచిది కాదు. దీనివల్ల చర్మపై ఉండే ఫోలికల్స్ దెబ్బతింటాయి. అంతేకాదు చాలా వేడి నీటిని తలపై పోయడం వల్ల వెంట్రుకలు బలహీనపడి రాలిపోతాయి. అదే సమయంలో చర్మంపై ఉండే సహజమైన తేమ తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం పొడిగా, సున్నితంగా మారుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే శరీరంలో రక్తప్రసరణ పెరిగి జలుబు, దగ్గు రాకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

చాలా వేడి నీటితో స్నానం చేస్తే కురులు, మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. మెదడు, గుండె రెండింటికీ హాని చేస్తుంది. అందుకని చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఎక్కువ వేడి నీటిని వాడకుండా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చర్మంతో పాటు జుట్టును రక్షించడమే కాకుండా చలికాలంలో శరీరాన్ని తాజాగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.