calender_icon.png 25 October, 2024 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులమని చెప్పి బంగారు గొలుసు చోరీ

18-09-2024 12:32:49 AM

రామాయంపేట(మెదక్), సెప్టెంబర్ 17: పోలీసులమని చెప్పి ఓ మహిళ వద్ద నుంచి బంగారు పుస్తెల తాడును దోచుకెళ్లిన సంఘటన రా మాయంపేట మండలం నందిగామ శివారులో చోటుచేసకుంది. నందిగామకు చెందిన మల్లేశం, అతని భార్య లక్ష్మీమంగళవారం మోపెడ్ వాహనంపై రామాయంపేటలోని ఆసుపత్రి కి వెళ్తున్నారు. నందిగామ శివారు దాటగానే ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వీరి వాహనాన్ని ఆపి తాము పోలీసులమని నకిలీ గుర్తింపు కార్డు లు చూపించి దొంగల బెడద చాలా వుందని, మెడలోంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్తున్నారని చెప్పా రు.

మెడలోని గొలుసును తీసి పేప రు కవర్లో పెట్టుకోవాలని సూచించా రు. వారి చెప్పినట్లుగానే వారు గొలుసును తీసి పేపరు కవర్లో పెట్టారు. అప్పటికే దొంగల వద్ద ఉన్న మరో కవర్‌ను గుర్తు పట్టకుండా వారికి ఇచ్చి అక్కడి నుంచిపారిపోయారు. కొద్దిదూరం వెళ్లాక లక్ష్మీ పేపర్ కవరు తీసి చూడగా అందులో రెండు గులకరాళ్లు దర్శనమిచ్చాయి. మోసపోయా మని తెలుసుకొని రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.