calender_icon.png 28 March, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేయాలి

24-03-2025 12:00:00 AM

  • 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చరిత్రాత్మకం

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి  23:(విజయక్రాం తి): అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టి బీసీలకు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు 29 శాతం నుంచి 42 శాతానికి పెంచడం అభినందనీయమని  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను 20 శాతం నుం చి 42 శాతంకు పెంచుతూ  రెండు బిల్లులు పాస్ చేయడం చారిత్రాత్మకమని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు ఆదివారం విద్యా నగర్‌లోని బీసీ భవన్‌లో 26 బీసీ కుల సంఘాల నాయకులు మణికంఠ, రాజు నేత అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఎంపీ ఆర్. కృష్ణ య్య మాట్లాడుతూ ఈ బిల్లు చట్టం చేయాలని, వెంటనే ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లులను కేం ద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూడడం సరికాదన్నారు.

చట్టస భలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమ లు చేయాలని, దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళల కు సటీ కోటా కల్పించాలని, విద్య, ఉద్యోగాలలో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు పెంచా లన్నారు. విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలన్నారు. 

జాతీయ స్థాయిలో ఓబీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు, ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు నీల వెంక టేష్ ముదిరాజ్, అనంతయ్య, సీ. రాజేందర్, మోదీ రాందేవ్, భాస్కర్ ప్రజాపతి, రమాదేవి, గుజ్జ రాఘవేందర్, యాదయ్య గౌడ్, నరసింహ గౌడ్, నరేష్ ముదిరాజ్, స్వామి గౌడ్, రవీందర్ యాదవ్, కుమార్ యాదవ్, మల్లేష్, బాలయ్య, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.