21-03-2025 12:47:58 AM
నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని
ముషీరాబాద్, మార్చి 20: (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్(ఎన్.పీ.జే.ఎఫ్) చైర్మన్ విజిఆర్ నారగోని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 17న చట్టం చేసిన నేపథ్యంలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ జీవోను జారీ చేయాలన్నారు.
పలు డిమాండ్ల సాధన కోసం ఏప్రి ల్ 14, 15, 16 తేదీల్లో ఎన్.పీ.జే.ఎఫ్ ప్రతినిధుల సమావేశాలు జరుగుతాయని తెలిపా రు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ దేశోద్దారక భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్రంట్ నేతలతో కలసి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనలో బడుగు బలహీనవర్గాలకు, మహిళలకు, ఎమ్మెల్సీ కులాలకు ప్రాతినిధ్యం లేకుం డా పోయిందన్నారు.
ఒకే వర్గం పరిపాలనగా మారిందన్నా రు. బిసి కులగణన తప్పు ల తడకగా మారిందన్నారు. బిసిల జనాభా 46 శాతం తగ్గించి చూపారన్నారు. బిసిలకు ఎక్కువ సీట్లను ఇస్తామని మాట మార్చారని మండిపడ్డారు. ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో తొక్కారన్నారు. బడుగులకు మం త్రివర్గంలో స్థానం లేదన్నారు. బిసిల సబ్ ప్లాన్ ఊసేలేదన్నారు. బడ్జెట్ లో బిసిలకు నామ మాత్రంగా కూడా ఇవ్వలేదన్నారు.
రాహుల్ సామాజిక న్యా యం అంటూ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారని, అగ్రకూలాలకు అధికారాన్ని కట్టబెట్టార న్నారు. ఈ సమావేశంలో ఫ్రంట్ నేతలు వీణ గోపి, ఆనందలక్ష్మి, పరమేశ్వరి, కె. మహేశ్వరరావు, సత్యనారాయణ, మామిడాల రాజులు, గుండు అంజయ్య నేతాజీ తదితరులు పాల్గొన్నారు.